Friday, January 20, 2017

trending funny video tiger attack on duck|duck plays with tiger|cinemapi...

Best love failure short film ,'After love' by Ranjith kumar |Cinemapistol

Ayyappa Swamy Pooja lo aunty ki poonakam |viral video|cinema pistol

Balakrishna multistatarer new movie with a big hero|cinemaoistol

ఖైదీ చూసి పవన్ ఏమన్నాడో తెలుసా..!|Pawan kalyan Reaction on Khaidi no 150...





#Pawankalyan,
#KhaidiNo150,
#Chiranjeevi,
#BossIsBack,
#KajalAggarwal,
#Megastar,
#RamCharan
#MegaStarChiranjeevi,
#Ichchapuram,
#Katamarayudu,
#VVVinayak,
#Tollywood,
#KhaidiNo150FromJan11th,
#Powerstar,
#Trivikram,
#Janasena,
#Movie,
#Sankranthi,
#AlluArjun
#Bollywood,
#Film,

NTR NEW FILM HEROIN FIXED|RASHIKHANNA VIDEOS|CINEMAPISTOL

Mahesh babu Responds On Jallikattu | Mahesh babu Tweets on Jallikattu| C...

Saturday, January 14, 2017

Nenu Local Theatrical Trailer - Nani, Keerthy Suresh | Devi Sri Prasad |...

telugu interesting facts written in telugu

Interesting Facts written in Telugu



 
తొమ్మిది గ్రహాలకున్న ఉపగ్రహాలన్నింటిలో అతి పెద్దది Ganymede .బృహస్పతి(Jupiter) చూట్టూ తిరిగే ఇది బుధగ్రహం కన్నా 8  రెట్లు పెద్దది.





 

అన్ని ఎడారుల్లోకి అతి పెద్దది సహారా ఎడారి .దీని వైశాల్యం 9,400,000 చదరపు కిలోమీటర్లు.



                         సముద్రంలోని బంగారాన్నంతా మనుషులకు పంచిపేధితే ఒక్కొక్కరికి సుమారు నాలుగున్నర కిలోలు వస్తుంది.




     

కళ్ళు తెరచి తుమ్మడం అసాధ్యం.



మనం పీల్చే ఆక్సిజెన్లొ  20 శాతం మేధడే ఉపయోగించుకుంటుంది.

 



 
ప్రతి రోజు అమెరికన్లు అందరు కలిసి సుమారు  75 ఎకరాల విస్తీర్ణంకి సమానమైన  pizza లు  తినేస్తున్నారు


 


ప్రపంచవ్యాప్తంగా  7500  రకాల వస్తువులపై మికిమౌస్ కనిపిస్తుంది.

 


సముధ్రాల్లో రోజు వందల సంఖ్యలో భూకంపాలు సంభవిస్తాయి.




 
                     అమెరికాలో అన్ని పందెం గుర్రాల పుట్టినరోజుల్ని జనవరి  1నే జరుపుతారు.





 

                        ఒక పెన్సిలుతో సుమారు 50 వేల ఎంగ్లీషు పదాలు 
                         రాయొచ్చు. 






ఒక ఎర్ర రక్త కణమ్ సెకన్లలో శరీరాన్ని చుట్టూ తిరిగేసివస్తుంది.





                               
పాండాలు రోజులో  14 గంటలు తింతూనే ఉంటాయి.






                       ఖడ్గమృగాలు కలత చెందినప్పుడు వాటి స్వేదం ఎర్రగా 
                     మారుతుంది.







                                   

                                         నాలుకపైన సుమారు   9వేల రుచి గ్రంధులుంటాయి.






క్షీరదాల్లో ఒక్క ధ్రువపు ఎలుగుబంత్లకు మాత్రమే అరికాళ్ళపై వెంట్రుకలు ఉంటాయి.






 

దాల్ఫిన్లు నిధ్రలో ఉండగానే ఈద గలవు.







 

                                                           కుందేళ్లకు అసలు చెమట రాదు.

 





అమేరిక అద్యక్షుడికి భవనమైన వైట్ హౌస్ లో కత్తులు ,ఫోర్క్‌లు , చెంచాలు కలిపి  సుమారు 13000 ఉన్నాయి.



 
ఆలివె చెట్లు  1500 ఏళ్లు బతుకుతాయి.

 




ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న విధ్యుత్ శక్తి 33 శాతాన్ని ,పెట్రోలులో 29 శాతాన్ని అమెరికాలో ఒక్కటే ఉపయోగించుకుంటుంది.




ప్రపంచవ్యాప్తంగా   5 వేలు రకాల బంగాళదుంపలున్నాయి.





                   
                       అన్ని పండ్లలోకి అవొకాడో ఎక్కువ క్యాలరీలను కలిగి ఉంటుంది.

 





                                జింకలు రోజుకు 5 నిముషాలు మాత్రమే నిధ్రిస్థాయి.

 




కోలాలు రోజుకు 19 గంటలు నిధ్రిస్థాయి.





 


వెదురు మొక్కలు ఒక రోజులో మూడు అడుగులకు పైగా పొడవు పెరుగుతాయి.

 


 

ఒక ప్లాస్టిక్ బాటల్ భూమిలో కరిగిపోడానికి సుమారు   450  ఏళ్లు పడుతుంది. 






 


తుపాను గాలిలో విడుదలయ్యే శక్తి ఒక మెగాటన్ను బాంబుతో సమానం.

 




 

 తుమ్మినప్పుడు గాలి  గంటకి    100 మైళ్ళ వేగంతో వస్తుంది.

 



 
ధృవపు ఎలుగు బంటులు ఆగకుండా 108 కిలోమీటర్లు ఈధ గలవు.






 


                  గోల్డ్‌ఫిష్ లు పరారుణ,అతినీలలోహిత కాంతిని కుడా చూడగలవు.

 

 

హుపింగ్ కొంగల కళ్ళు పుట్టినప్పుడు నీలిరంగులో ఉంటే, ఆర్నెల్ల తరువాత బంగారం రంగులోకి మారిపోతాయి.

 



పెసిఫిక్ సముధ్రంలో సుమారు 25 వేల ధీవులున్నాయి . ఇవి భూమి మీద ఉన్న ధీవుల సంఖ్య కన్నా ఎక్కువ.




ఏలాస్కా బ్రౌన్ ఎలుగుబంటీ సుమ్మారు 771 కిలోల బరువుంటుంది. 

 




లెమన్ షార్క్లకు 14 రోజులకోకసారి కొత్త దంతాలు పుట్టుకొస్తాయి . అలా ఏదాధిలో సుమారు 24 వేల పళ్ళు వస్తాయి.



                    ఏనుగు తోండమ్ తో సుమారు  7లీటర్ల నీటిని పీల్చుకోగలదు.

 



 
                               పన్నెండు లక్షల ధోమలూ ఒకేసారి మన శరీరంలోని రక్తాన్నంత పీల్చేయగలవు.

 




             
సముద్రంలో అతి వేగంగా పెరిగే మొక్క జైఈంట్ కెల్ప్ ,దీని ఏధుగుదల రోజుకు 2అడుగులు.





          షార్క్ లు రక్తపు బొట్టు వాసన్ని మైలు దూరం నుంచే పసిగట్టగలవు.

 


 

ఆల్బత్రాస్ పక్షులు ఎగురతూనే నిద్రపోగలవు


Thursday, January 12, 2017

Why Do Onions Make You Cry?|ఉల్లిపాయ కొస్తే ఏడుపు ఎందుకు వస్తుంది?

manaku chala doughts unntai andulo oka dought e onions cut chesthey kallalo unnchi water yenduku vasthundi adi teslukovadaniki e video chudandi meeke artham avthunndi....chusina tharuvatha mee opinion comment cheyandi....

gautamiputra satakarni movie review

చిత్రం : ‘గౌతమీపుత్ర శాతకర్ణి’

నటీనటులు: నందమూరి బాలకృష్ణ - శ్రియ సరన్ - హేమమాలిని - కబీర్ బేడి - మిలింద్ గుణాజీ - ఫరా కరిమి - తనికెళ్ల భరణి - శుభలేఖ సుధాకర్ తదితరులు
సంగీతం: చిరంతన్ బట్
ఛాయాగ్రహణం: జ్నానశేఖర్
మాటలు: సాయిమాధవ్ బుర్రా
నిర్మాతలు: సాయిబాబా జాగర్లమూడి - రాజీవ్ రెడ్డి
రచన - దర్శకత్వం: క్రిష్

గౌతమీపుత్ర శాతకర్ణి.. తెలుగు పరిశ్రమలో పది నెలలుగా తీవ్ర చర్చనీయాంశమవుతున్న సినిమా. ప్రారంభోత్సవం జరుపుకున్న నాటి నుంచి జనాల్లో విపరీతమైన ఆసక్తి రేకెత్తిస్తూ.. ఎప్పటికప్పుడు కళ్లు చెదిరే ప్రోమోలతో ఆసక్తిని మరింత పెంచుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు వెండితెరను తాకింది. మరి నందమూరి బాలకృష్ణ-క్రిష్ కలిసి చేసిన ఈ బృహత్తర ప్రయత్నం ఎలా ఉందో చూద్దాం పదండి.

కథ:

రాజులు.. రాజ్యాలు.. యుద్ధాలకు సంబంధించి అమ్మ చెబుతున్న కథ వింటూ.. ముక్కలు ముక్కలుగా ఉన్న భరత ఖండాన్ని ఏకం చేయాలని చిన్నతనంలోనే దృఢ నిశ్చయానికి వస్తాడు శాతకర్ణి. ఇక రాజ్యాధికారం చేపట్టగానే తన లక్ష్యాన్ని నెరవేర్చుకునే దిశగా అడుగులు వేస్తాడు. ముందు దక్షిణ భారతాన్ని గెలిచి.. ఆపై ఉత్తర భారతంపైకి దండెత్తుతాడు. ఈ క్రమంలో తన కొడుకు ప్రాణాలకే ముప్పు వాటిల్లినా.. తన భార్య నుంచి వ్యతిరేకత ఎదురైనా వెనక్కి తగ్గడు. మొత్తం దేశాన్ని వశం చేసుకున్నాక పరాయి దేశస్థుల నుంచి శాతకర్ణికి సవాలు ఎదురవుతుంది. మరి ఈ సవాలును శాతకర్ణి ఎలా ఛేదించాడు. రణరంగంలో ఎలా విజేతగా నిలిచాడు అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ: ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ఆరంభ సన్నివేశంలో ఒక సంభాషణ ఎలా సాగుతుందో చూద్దాం. తన పరాక్రమాన్ని గౌరవించి రాజ్యాన్ని అప్పగించమంటూ శాతకర్ణి పంపిన వర్తమానాన్ని అవతలి రాజుకు అందిస్తాడు దూత. అవతలి రాజుకు పౌరుషం వస్తుంది. దూతను ఉద్దేశించి ‘‘నిన్ను బంధిస్తే’’ అంటాడు అవతలి రాజు. ‘‘వారొస్తారు. నేను కారాగారంలో ఎదురు చూస్తుంటా’’ అని బదులిస్తాడు దూత. వెంటనే ‘‘నిన్ను వధిస్తే’’ అంటూ రెట్టించి అడుగుతాడు అవతలి రాజు. ‘‘మీరొస్తారు. నేను కాటికాడ ఎదురు చూస్తుంటా’’ అంటాడు దూత. ఈ సంభాషణతోనే అర్థమైపోతుంది ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ స్థాయి ఏంటో!

ఇది ఏ వర్గం ప్రేక్షకులకు నచ్చుతుంది.. ఎంత వసూలు చేస్తుంది.. ఏ స్థాయి విజయం సాధిస్తుంది.. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ విషయంలో ఇలాంటి లెక్కలన్నీ పక్కనబెట్టేయాలి. చిత్ర బృందం ముందు నుంచి నొక్కి వక్కాణిస్తున్నట్లుగా ఇది తెలుగు వారు గర్వించే చిత్రం అనడంలో సందేహం లేదు. విజువల్ గ్రాండియర్.. ఎఫెక్ట్స్.. నిర్మాణ విలువలు.. లాంటి అంశాల్లో ‘బాహుబలి’ కంటే వెనుక ఉండొచ్చు కానీ.. విషయ ప్రధానంగా చూస్తే మాత్రం ‘బాహుబలి’ కంటే మిన్నగా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ఉందంటే అతిశయోక్తి లేదు. అంత గొప్పగా.. సిన్సియర్ గా ఈ కథను తెరకెక్కించాడు క్రిష్. శాతకర్ణి పాత్రకు తాను తప్ప ఇంకెవరూ ఊహలోకి కూడా రాని స్థాయిలో అద్భుత అభినయం ప్రదర్శించాడు బాలకృష్ణ. ఈ ఇద్దరూ కలిసి చేసిన మహా ప్రయత్నానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

గొప్ప చరిత్ర.. నేపథ్యం ఉన్న శాతకర్ణి కథను రెండుం పావు గంటల్లో క్రిష్ ఎలా చెప్పాడా అని సందేహం కలగొచ్చు. ఐతే శాతకర్ణి కథ అనగానే పుట్టుక.. బాల్యం.. యవ్వనం.. రాజుగా ఆధిపత్యం.. చరమాంకం అంటూ చాలా అధ్యాయాలు చూపించే ప్రయత్నం చేయకుండా కేవలం అతడి లక్ష్యం.. ఆ దిశగా పోరాటం.. ఈ నేపథ్యంలోనే కథను నడిపించాడు క్రిష్. ఈ విషయంలో అతడికి ఎంత స్పష్టత ఉందో ప్రతి సన్నివేశంలోనూ కనిపిస్తుంది. నేరుగా దక్షిణ భారతాన్ని గుప్పెట్లోకి తెచ్చుకునే ఘట్టంతోనే శాతకర్ణి పరిచయ దృశ్యాన్ని ఆవిష్కరించాడు క్రిష్. ఆ తర్వాత మొత్తం భారతాన్ని తన చేతుల్లోకి తెచ్చుకోవడం.. చివరగా పరదేశీయులతో పోరాడి గెలవడంతో కథ ముగిసిపోతుంది. ఈ మధ్యలో సొంత కొడుకునే రణరంగంలోకి తీసుకెళ్లడం.. భార్యే శాతకర్ణితో తీవ్రంగా విభేదించడం.. ఈ నేపథ్యంలో భావోద్వేగాల నడుమ కథ నడుస్తుంది. సినిమాలో ప్రతి సన్నివేశం కూడా శాతకర్ణి లక్ష్యంతో ముడిపడే ఉంటాయి. దాన్నుంచి క్రిష్ ఎక్కడా డీవియేట్ కాలేదు.

శాతకర్ణికి యుద్ధ సన్నివేశాలే బలం.. బలహీనత. తనకున్న బడ్జెట్ పరిమితుల్లోనే ఆ సన్నివేశాల్ని అద్భుతంగా తీర్చిదిద్దాడు క్రిష్. ‘బాహుబలి’లో లాగా కళ్లు చెదిరిపోయేలా చేయకున్నా.. ఈ సన్నివేశాలు ఉన్నత ప్రమాణాలతోనే ఉండి మెప్పిస్తాయి. కానీ సినిమాలో సగానికి పైగా నిడివి యుద్ధ సన్నివేశాలతోనే నిండిపోవడంతో ఓ దశలో మొహం మొత్తేసిన భావనా కలుగుతుంది. కొన్ని సన్నివేశాలు రిపీటెడ్ గానూ అనిపిస్తాయి. అసలు కథను యుద్ధ సన్నివేశాలు డామినేట్ చేసినట్లు అనిపిస్తుంది. చూసేవాళ్లకు శాతకర్ణి యుద్ధ పిపాసి లాగా.. అధికార దాహంతో తపించిపోయేవాడిలాగా కనిపిస్తాడు. సినిమా చూస్తున్నంతసేపూ ప్రేక్షకులకు కూడా అదే భావన కలుగుతుంది. ఎందుకంటే 2 గంటల 15 నిమిషాల నిడివిలో చాలా వరకు యుద్ధాలే కనిపిస్తాయి. సినిమా చూశాక పోరాట దృశ్యాలే కళ్లముందు కదలాడుతాయి. ఐతే నెమ్మదిగా ఆలోచిస్తే ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ అసలు ఉద్దేశం అర్థమవుతుంది. ఈ కథతో అంతర్లీనంగా క్రిష్ ఏం చెప్పాలనుకుంటున్నాడో తెలుస్తుంది. ఎంత చారిత్రక కథ అయినా.. కమర్షియల్ లెక్కలు వేసుకుంటారు మన దర్శకులు. కానీ క్రిష్ అలా ఆలోచించలేదు. కథను చెప్పే విషయంలో రాజీ పడలేదు. సిన్సియర్ గా.. ఎక్కడా డీవియేట్ కాకుండా తానేం చెప్పాలనుకున్నాడు అది చెప్పాడు. ఏదీ విడమరిచి.. వివరించి చూపించలేదు క్రిష్. కానీ అంతర్లీనంగా అతను చెప్పిన కథలో ఎంతో విషయం ఉంది. నెమ్మదిగా సినిమా సింక్ అయ్యాక ఆ విషయాలన్నీ అర్థమవుతాయి.

మామూలుగా బాలయ్య సినిమాల నుంచి ఆయన మాస్ అభిమానులు ఆశించే వినోదం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’లో తక్కువే కానీ.. ఇందులోనూ గూస్ బంప్స్ మూమెంట్స్ కు ఢోకా లేదు. యుద్ధంలో తన చేతిలో ఓడిపోయాక శత్రు రాజు వచ్చి తల వంచుతాడు. వెంటనే శాతకర్ణి.. ‘‘తల వంచకు. అది నేను గెలిచిన తల’’ అంటాడు. ఇంతకంటే రోమాలు నిక్కబొడుచుకునే సన్నివేశం ఏముంటుంది? ప్రమాణాల పరంగా.. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ఉన్నతమైన స్థానంలోనే ఉంటుంది కానీ.. ఇప్పుడిప్పుడే అభిరుచి మార్చుకుంటున్న సగటు తెలుగు ప్రేక్షకుడు ఈ సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటాడో అన్న సందేహాలూ లేకపోలేదు. కమర్షియల్ గా ఇది ఏ స్థాయి విజయం సాధిస్తుందో చెప్పలేం. చరిత్రను ఉన్నదున్నట్లు చూపించాడా.. వక్రీకరించాడా అన్నది నిపుణులు తేల్చాలి. ఐతే ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చూశాక మాత్రం శాతకర్ణి గొప్పగా అనిపిస్తాడు. క్రిష్.. బాలయ్య ఇద్దరూ కలిసి ‘శాతకర్ణి’కి అంత ఉన్నతమైన స్థానం కట్టబెట్టారు. కచ్చితంగా ఇది తెలుగువారు గర్వించదగ్గ చిత్రమే.

నటీనటులు:

‘గౌతమీపుత్ర శాతకర్ణి’ మొదలైనప్పటి నుంచి బయట కూడా తాను నిజంగానే శాతకర్ణిని అన్నట్లు ప్రవర్తించిన బాలయ్యను చూసి కొంతమందికి తమాషాగా అనిపించి ఉండొచ్చేమో కానీ.. ఆయన ఈ పాత్రను ఎంతగా ఓన్ చేసున్నారో.. ఎంతగా ఆ పాత్రలో లీనమయ్యారో సినిమా చూస్తే కానీ అర్థమవదు. శాతకర్ణిగా బాలయ్య అభినయం గురించి ఎంత చెప్పినా తక్కువే. అద్భుతమైన వాచకం.. హావభావాలతో శాతకర్ణి పాత్రను గొప్పగా పండించాడు బాలయ్య. ఆయన కెరీర్లో ఇది ది బెస్ట్ పెర్ఫామెన్స్ అని నిస్సందేహంగా చెప్పేయొచ్చు. నటనలో మాత్రం ఎక్కడా ఒక చిన్న సన్నివేశంలోనూ బాలయ్యకు వంకలు పెట్టడానికి లేదు. పాత్రకు తగ్గ రౌద్రం.. వాచకంతో తిరుగులేని రీతిలో నటించాడు బాలయ్య. ఫలానా సన్నివేశం అని కాదు.. సినిమా అంతటా బాలయ్య అద్భుత అభినయాన్ని ప్రదర్శించారు. క్రిష్ అన్నట్లుగా శాతకర్ణి పాత్రను బాలయ్య మాత్రమే చేయగలడు అనిపించాడు. సాయిమాధవ్ బుర్రా మాటల్ని పలికిన విధానానికి బాలయ్యకు హ్యాట్సాఫ్ చెప్పాలి.

సినిమాలో మిగతా నటీనటులందరూ కూడా బాగా నటించారు. హేమమాలిని.. శ్రియలకు స్క్రీన్ ప్రెజెన్స్ తక్కువే అయినా ఉన్నంతసేపూ సినిమా స్థాయికి తగ్గట్లుగా గొప్పగా నటించారు. తనలో ఎంత మంచి నటి ఉందో ఈ సినిమాతో శ్రియ చూపించింది. భర్త కోసం కొడుకును కోల్పోతానేమో అన్న సంఘర్షణకు గురయ్యే సన్నివేశాల్లో శ్రియ నటన కట్టిపడేస్తుంది. హేమమాలిని కూడా పాత్ర స్థాయికి తగ్గట్లుగా నటించింది. కబీర్ బేడికి పెద్దగా అవకాశం దక్కలేదు. మిలింద్ గుణాజీ ఆకట్టుకున్నాడు. మిగతా వాళ్లందరూ కూడా బాగానే చేశారు.

సాంకేతిక వర్గం:

టెక్నీషియన్స్ అందరూ కూడా సినిమా స్థాయికి తగ్గట్లే పనితనం చూపించారు. చిరంతన్ బట్ నేపథ్య సంగీతం అద్భుత: అనిపిస్తుంది. తొలి యుద్ధ సన్నివేశంలోనే బ్యాగ్రౌండ్ స్కోర్ రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తుంది. రెండో యుద్ధం శాతకర్ణి సేనలు కుంగుబాటుకు గురైన సందర్భంలో వచ్చే నేపథ్య సంగీతం చిరంతన్ స్థాయిని తెలియజేస్తుంది. సినిమా అంతటా కూడా నేపథ్య సంగీతం గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. సాహో సార్వభౌమ.. మృగనయనా లాంటి పాటలు కూడా బాగున్నాయి. మొత్తంగా చిరంతన్ సంగీతం సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ అయింది. జ్నానశేఖర్ ఛాయాగ్రహణం కూడా గొప్పగా సాగింది. సినిమా నేపథ్యం.. అప్పటి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని జ్నానవేఖర్ కొంచెం డల్ లైటింగ్ ఉండేలా చూసుకోవడంలోనూ అతను పెట్టిన ప్రత్యేక శ్రద్ధ అర్థమవుతుంది. బడ్జెట్ పరిమితులున్నప్పటికీ యుద్ధ సన్నివేశాల్ని ఉన్నంతలో గొప్ప ప్రమాణాలతో తెరకెక్కించాడు జ్నానశేఖర్. వీఎఫెక్స్ తో ముడిపడని ప్రతి సన్నివేశంలోనూ జ్నానశేఖర్ ప్రతిభ కనిపిస్తుంది.

సాయిమాధవ్ బుర్రా తన కలం పదునేంటో చూపించాడు. అద్భుతమైన మాటలు రాశాడు. సాయిమాధవ్ తప్ప ఇంకెవరూ ఇలాంటి మాటలు రాయలేడేమో అనిపించాడు. ‘‘కాలం చేసైనా కాలాన్ని కందాం’’ అనే ఒక చిన్న డైలాగ్ చాలు సినిమాలో సాయిమాధవ్ మాటలు ఎంత ప్రత్యేకంగా ఉన్నాయో చెప్పడానికి. వారెవా అనిపించే ఇలాంటి మాటలు సినిమాలో చాలా ఉన్నాయి. ఐతే మాటల విషయంలో కొన్ని చోట్ల నిలకడ తప్పింది. కొన్ని చోట్ల ఫక్తు గ్రాంథికం మాటలు వినిపిస్తాయి. కొన్ని చోట్ల ఇప్పటి తరహాలో మామూలు మాటలు ఉంటాయి. ఈ విషయంలో కన్సిస్టెన్సీ ఉండేలా చూసుకోవాల్సింది. ఈ లోపాన్ని పక్కబెడితే సాయిమాధవ్ బుర్రా తన మాటలతో సినిమాకు పెద్ద బలంగా నిలిచాడు.

‘బాహుబలి’ చూసిన కళ్లతో చూస్తే ఇందులోని విజువల్ ఎఫెక్ట్స్ అంత గొప్పగా అనిపించవు. వాటిని సాధ్యమైనంత పరిమితం చేసే ప్రయత్నం చేశాడు క్రిష్. ఫైట్ మాస్టర్లు.. ఆర్ట్ డైరెక్టర్ కృషి గురించి కూడా ప్రత్యేకంగా ప్రస్తావించాలి. దర్శకుడిగా.. నిర్మాతగా క్రిష్ చేసిన సాహసం గురించి.. అతడి పనితనం గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమాలో ప్రతి సన్నివేశంలోనూ అతడి ముద్ర కనిపిస్తుంది. ఇలాంటి భారీ చారిత్రక కథను ఈ స్థాయిలో చెప్పగలిగే నైపుణ్యం.. ఇంత వేగంగా పూర్తి చేయగలిగే పనితనం ఎలా సంపాదించాడో అని ఆశ్చర్యం కలిగేలా క్రిష్ అబ్బురపరిచాడు. కంటెంట్ పరంగా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ని ‘బాహుబలి’ కంటే ఓ మెట్టు పైనే నిలిపాడంటే అతిశయోక్తి కాదు. క్రిష్ కథను చెప్పిన విధానం.. సన్నివేశాల్ని తీర్చిదిద్దిన తీరు.. ఎమోషన్లను పండించిన వైనానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

చివరగా: గౌతమీపుత్ర శాతకర్ణి.. సాహో క్రిష్.. సాహో బాలయ్య..తెలుగువారు గర్వించదగ్గ చిత్రమే.

రేటింగ్: 3.25/5

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/


Disclaimer : This Review is An Opinion of Review Writer. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre

Wednesday, January 11, 2017

Khaidi no.150 movie review

చిత్రం: ఖైదీ నెంబర్ 150  

నటీనటులు: చిరంజీవి - కాజల్ అగర్వాల్ - తరుణ్ అరోరా - ఆలీ -బ్రహ్మానందం - రఘుబాబు - జయప్రకాష్ రెడ్డి -నాజర్ - పోసాని కృష్ణమురళి - రఘు కారుమంచి -పృథ్వీ తదితరులు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
ఛాయాగ్రహణం: రత్నవేలు
రచన: పరుచూరి బ్రదర్స్ - సాయిమాధవ్ బుర్రా - వేమారెడ్డి
కథ: మురుగదాస్
నిర్మాత: రామ్ చరణ్
స్క్రీన్ ప్లే - దర్శకత్వం: వి.వి.వినాయక్

దాదాపు దశాబ్దం విరామం తర్వాత మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఖైదీ నెంబర్ 150’. తన రీఎంట్రీ మూవీ కోసం పరిపరివిధాలుగా ఆలోచించి తమిళ బ్లాక్ బస్టర్ మూవీ ‘కత్తి’ని రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నాడు చిరు. ఒకప్పుడు మురుగదాస్ సినిమానే వినాయక్ దర్శకత్వంలో ‘ఠాగూర్’గా రీమేక్ చేసి ఇండస్ట్రీ హిట్టు కొట్టిన చిరు.. ఈసారి కూడా మురుగదాస్ కథతోనే వినాయక్ దర్శకత్వంలో సినిమా చేశాడు. మరి వీళ్లిద్దరి కాంబినేషన్ ఈసారి ఎలాంటి మ్యాజిక్ చేసింది..? సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపై చిరు ఎలా కనిపించాడు..? ఎలా పెర్ఫామ్ చేశాడు..? మొత్తంగా ‘ఖైదీ నెంబర్ 150’ ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతినిచ్చేలా ఉంది..? చూద్దాం పదండి.

కథ: 

చిన్నప్పట్నుంచి దొంగతనాలు చేయడం అలవాటైన కత్తి శీను (చిరంజీవి) కోల్ కతా జైల్లో శిక్ష అనుభవిస్తుంటాడు. ఆ జైలు నుంచి తప్పించుకున్న ఓ ఖైదీని పట్టించేందుకు పోలీసులకు సాయపడ్డట్లే పడి.. వాళ్లను బోల్తా కొట్టించి హైదరాబాద్ వచ్చేస్తాడు. ఇక్కడి నుంచి శీను బ్యాంకాక్ వెళ్లబోతూ ఎయిర్ పోర్టులో లక్ష్మి (కాజల్) అనే అమ్మాయిని చూసి ప్రేమలో పడిపోయి ఆ ప్రయత్నం మానుకుంటాడు. ఇంతలో కొన్ని కారణాల వల్ల శీను తనలాగే ఉండే శంకర్ అనే ఉద్యమకారుడి స్థానంలోకి వెళ్లాల్సి వస్తుంది. ముందు తాను తప్పించుకోవడానికి శంకర్ ను వాడుకునే ప్రయత్నం చేసినా.. ఆ తర్వాత శంకర్ గొప్పదనమేంటో శీనుకు తెలిసి అతడి కోసం పోరాటానికి సిద్ధపడతాడు. ఇంతకీ శంకర్ ఎవరు.. అతడు ఎవరి కోసం ఉద్యమిస్తున్నాడు.. ఆ ఉద్యమానికి శీను ఏ విధంగా తోడ్పడ్డాడు.. అతడి సమస్యను ఎలా పరిష్కరించాడు.. అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ: 

ముందుగా ‘ఖైదీ నెంబర్ 150’లో ఒక ముఖ్యమైన సన్నివేశం గురించి మాట్లాడుకుందాం. ప్రి క్లైమాక్సులో కథ చాలా సీరియస్ గా సాగుతుంటుంది. రైతుల సమస్య సిటీలో జనాలకూ తెలియాలనే ఉద్దశంతో హీరో తెలివైన ఎత్తుగడ వేస్తాడు. ఆ ఎత్తుగడ ఆసక్తి రేకెత్తిస్తుంది. కథ మలుపు తిరుగుతుంది. తర్వాత ఏం జరుగుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంటే.. అప్పుడో కమర్షియల్ బ్రేక్ వస్తుంది.

హీరోయిన్ హీరోకు ఫోన్ చేసి అతణ్ని అభినందిస్తుంది. ఇప్పుడీ అభినందనలు ఎందుకయ్యా అంటే.. పాట కోసం అన్నమాట. అమ్మడూ.. లెట్స్ డు కుమ్ముడు అంటూ చిరు చెలరేగిపోతాడు. ఆ పాటలో చిరు డ్యాన్సులు అదిరిపోయాయి. మధ్యలో చరణ్ కూడా వచ్చి రచ్చ చేస్తాడు. అభిమానుల ఆనందానికి అవధులుండవు. ఐతే అంత సీరియస్ వ్యవహారం సాగుతున్నపుడు మధ్యలో ఈ పాట అవసరమా అంటే మాత్రం ఏం చెప్పాలో తెలియదు. అభిమానుల్ని ఆ పాట అలరించే మాట వాస్తవం. కానీ కథాగమనానికి మాత్రం ఆ పాట పెద్ద అడ్డంకే. ఇలాంటి అడ్డంకులు.. డీవియేషన్లు ‘ఖైదీ నెంబర్ 150’లో అక్కడక్కడా ఉన్నాయి.

ఎంతో ఇంటెన్సిటీ ఉన్న సిన్సియర్ కథ ఉంది ‘ఖైదీ నెంబర్ 150’లో. కానీ ఆ కథను అంత ఇంటెన్సిటీతో.. అంత సిన్సియర్ గా మాత్రం చెప్పలేదు. ఐటెం సాంగ్ అని.. డ్యాన్సులని.. కామెడీ అని.. తమిళ మాతృకకు అద్దిన కమర్షియల్ హంగులు చిరంజీవి అభిమానుల్ని బాగానే మెప్పిస్తాయి. మాస్ ప్రేక్షకుల్ని అలరిస్తాయి. ఐతే ఈ హంగులు దీని మాతృక అయిన ‘కత్తి’లో ఉన్న ఇంటెన్సిటీని మాత్రం తగ్గించేశాయి. దశాబ్దం తర్వాత తెరపై పూర్తి స్థాయిలో కనిపించిన చిరు తనదైన శైలిలో అభిమానుల్ని ఎంటర్టైన్ చేస్తాడు ‘ఖైదీ నెంబర్ 150’లో. ఆయన నుంచి అభిమానులు ఆశించే ఆకర్షణలకు మాత్రం ‘150’లో లోటు లేదు.

చిరంజీవి నుంచి ప్రేక్షకులు ప్రధానంగా ఆశించేది ఎంటర్టైన్మెంట్. అందుకే చాలా వరకు సీరియస్ గా సాగే ‘కత్తి’ని తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మార్చినట్లున్నాడు వినాయక్. ఈ విషయంలో అతను తప్పు చేశాడా అంటే ఏమో చెప్పలేం. ‘కత్తి’లో మాదిరే చిరు సినిమా అంతా సీరియస్ గా కనిపిస్తే ప్రేక్షకులకు రుచించేది కాదేమో. తమిళ వెర్షన్లో హీరోయిజానికి.. గూస్ బంప్స్ మూమెంట్స్ కు   ఢోకా ఉండదు కానీ.. ఏదైనా కూడా కథలోనే మిళితమై ఉంటుంది. ‘ఖైదీ నెంబర్ 150’లో మాత్రం డీవియేషన్ కనిపిస్తుంది. చిరు ఇమేజ్ ను దృష్టిలో ఉంచుకుని ఇందులో కామెడీ.. ఐటెం సాంగ్.. క్లైమాక్స్ కు ముందు ఓ మాస్ సాంగ్.. ఇలాంటి హంగులు జోడించారు. దీంతో కథ అక్కడక్కడా పక్కదోవ పట్టినట్లుగా అనిపిస్తుంది. అదే సమయంలో సినిమా బోరింగ్ గా అనిపించదు. కామెడీ కోసం పెట్టిన సన్నివేశాలు మినహాయిస్తే అంతా ఎంగేజింగ్ గానే సాగుతుంది.

రైతుల నుంచి భూముల్ని చౌకగా కొట్టేసి వాటితో వ్యాపారం చేసే ఓ కార్పొరేట్ సంస్థతో కథానాయకుడు చేసే పోరాటమే ‘ఖైదీ నెంబర్ 150’. సామాజికాంశాలతో ముడిపడ్డ కథను కమర్షియల్ కోణంలో చెప్పడం ఈ సినిమా ప్రత్యేకత. కంటెంపరరీగా అనిపించే ‘ఫార్మర్స్ వెర్సస్ కార్పొరేట్’ కాన్సెప్టుతో ప్రేక్షకులు ఈజీగా కనెక్టవుతారు. హృద్యంగా సాగే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సినిమాకు ఆయువు పట్టు. అక్కడ కథను బలంగా చెప్పారు. వర్తమానంలోకి వస్తే ప్రధానంగా హీరోయిజమే కనిపిస్తుంది. కథనం మామూలుగా అనిపిస్తుంది. విలన్ హీరో మీదికి అటాక్ చేయడం.. హీరో దీటుగా బదులివ్వడం.. ఇలా సాగుతుంది కథ. ఐతే మాస్ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించే కాయిన్ ఫైట్ లాంటివి ఆకట్టుకుంటాయి. చిరు-కాజల్ మధ్య రొమాంటిక్ ట్రాక్ ఏమంత ఆసక్తికరంగా ఉండవు.

ప్రథమార్ధంలో ఫ్లాష్ బ్యాక్ మినహాయిస్తే చెప్పుకోదగ్గ విశేషాలేమీ లేవు. ఐతే ద్వితీయార్ధంలో కథ మంచి ఇంటెన్సిటీతో సాగుతుంది. హీరో-విలన్ పోరు కంటే కూడా.. హీరో సమస్య మీద పోరాడే తీరు ఆకట్టుకుంటుంది. ప్రి క్లైమాక్సులో వచ్చే ‘వాటర్’ ఎపిసోడ్ సినిమాకు ప్రధాన ఆకర్షణ. క్లైమాక్స్ ఓకే అనిపిస్తుంది. చిరంజీవికి.. ఆయన పాత్రకు తగ్గట్లుగా విలన్.. ఆ పాత్ర కుదర్లేదు. సినిమాలో విలన్ పాత్ర పూర్తిగా తేలిపోయింది. ఆ పాత్రలో బలం లేకపోవడంతో హీరో-విలన్ మధ్య పోటీ అన్నదే కనిపించదు. ఇది సినిమాకు మైనస్ అయింది. ఓవరాల్ గా చూస్తే ‘ఖైదీ నెంబర్ 150’ మంచి కథ ఉంది కానీ.. దాన్ని అంత ప్రభావవంతంగా చెప్పలేదు. ఐతే చిరు మాత్రం తన అభిమానుల్ని పూర్తిగా సంతృప్తి పరుస్తాడు. ఫ్యాన్స్ ఆయన్ని ఎలా చూడాలనుకుంటారో అలా కనిపిస్తారు. మాస్ మసాలా అంశాలకు ఇందులో లోటు లేదు. లోటు పాట్లున్నప్పటికీ సినిమా ‘పైసా వసూల్’ అనిపిస్తుంది.

నటీనటులు: 

చిరంజీవి చివరగా కథానాయకుడిగా నటించిన ‘శంకర్ దాదా జిందాబాద్’లో కంటే కూడా ‘ఖైదీ నెంబర్ 150’లో అందంగా కనిపించారు అంటే అతిశయోక్తి కాదు. అంత బాగా తన లుక్ ను మార్చుకున్నాడు చిరు. ఆయన లుక్ చూసి.. ఎనర్జీ చూసి ప్రేక్షకులు కచ్చితంగా ఆశ్చర్యపోతారు. స్టైలింగ్ పరంగానూ చిరు ఆకట్టుకున్నాడు. కత్తి శీను పాత్రకు తగ్గట్లుగా ఎనర్జిటిగ్గా నటించాడు చిరు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్.. డ్యాన్సులు అభిమానుల్ని ఆకట్టుకుంటాయి. చిరు డ్యాన్సుల్లో మరీ స్పీడ్ లేదు కానీ.. రిథమ్.. గ్రేస్.. స్టయిల్ కు మాత్రం ఢోకా లేదు. కామెడీ సన్నివేశాల్లో చిరు ముద్ర కనిపిస్తుంది. 

సినిమా మొత్తం చిరు చుట్టూనే తిరగడంతో ఇంకెవరూ పెద్దగా హైలైట్ కాలేదు. హీరోయిన్ కాజల్ అగర్వాల్ సినిమాకు ప్లస్ కాలేకపోయింది. ఆమె పాత్ర.. నటన అన్నీ కూడా మొక్కుబడిగా ఉన్నాయి. హెవీ మేకప్ కాజల్ లుక్ ను దెబ్బ తీసినట్లుగా అనిపిస్తుంది. ఆమె చాలా వరకు పాటలకే పనికొచ్చింది. కానీ పాటల్లో ఫోకస్ అంతా కూడా చిరు మీదే ఉండటంతో కాజల్ నామమాత్రంగా కనిపిస్తుంది. విలన్ పాత్రలో తరుణ్ అరోరా తేలిపోయాడు. అతడి పాత్ర ఎఫెక్టివ్ గా లేదు. నటన కూడా అలాగే సాగింది. డబ్బింగ్ విషయంలో శ్రద్ధ పెట్టకపోవడం వల్ల కూడా ఆ పాత్రతో ప్రేక్షకులు కనెక్టవ్వలేరు. బ్రహ్మానందం ఓ మోస్తరుగా నవ్వించాడు. ఆయన పాత్రలో కొత్తదనం లేదు. చిరు వెంటే ఉండే పాత్రలో ఆలీ పర్వాలేదు. రఘుబాబు.. జయప్రకాష్ రెడ్డి ఒకట్రెండు సన్నివేశాల్లో నవ్వించారు. మిగతా వాళ్లంతా మామూలే.

సాంకేతిక వర్గం: 

దేవిశ్రీ ప్రసాద్ చిరు ప్రధానంగా అభిమానుల్ని.. మాస్ ప్రేక్షకుల్ని మెప్పించే మ్యూజిక్ ఇచ్చాడు. యు అండ్ మి పాట మళ్లీ మళ్లీ వినాలనిపించే మెలోడీ. నీరు నీరు పాటు హృద్యంగా అనిపిస్తుంది. సినిమాలో అది మంచి టైమింగ్ లో వస్తుంది. ఈ పాట థీమ్ ను బ్యాగ్రౌండ్ స్కోర్లో బాగా వాడుకున్నాడు దేవి. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కు నేపథ్య సంగీతం బలంగా నిలిచింది. మిగతా సినిమా అంతా జస్ట్ ఓకే అనిపిస్తుంది. రత్నవేలు గతంలో చేసిన సినిమాల్లో లాగా కెమెరా పనితనం అంత ప్రత్యేకంగా అనిపించదు కానీ.. సినిమాకు రిచ్ లుక్ మాత్రం తీసుకొచ్చింది. ఆద్యంతం కలర్ ఫుల్ విజువల్స్ ఆకట్టుకుంటాయి. చిరును రత్నవేలు చాలా బాగా చూపించాడు. పాటల చిత్రీకరణలోనూ రత్నవేలు ప్రతిభ కనిపిస్తుంది. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. 

సినిమాకు మాటలు పరుచూరి బ్రదర్స్.. సాయిమాధవ్ బుర్రా.. వేమారెడ్డి కలిసి అందించారు. రైతు సమస్యల నేపథ్యంలో వచ్చే మాటలు ఆలోచింపజేసేలా ఉన్నాయి. అభిమానుల కోసం రాసిన పంచ్ డైలాగులు ఏమంత బాగా లేవు. సినిమాలో ఆ డైలాగులు సింక్ అవలేదు. ఇలాంటి డైలాగులకు కాలం చెల్లిందని గుర్తించాలి. ఇక దర్శకుడు వి.వి.వినాయక్ విషయానికి వస్తే.. అతను చిరు కోరుకున్నట్లు సినిమా తీసి పెట్టాడు. ‘కత్తి’ సినిమాకు తనదైన కమర్షియల్ టచ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. మూల కథను మార్చలేదు కానీ.. కామెడీ.. కమర్షియల్ హంగులు అద్దాడు. చిరు ఇమేజ్ కు తగ్గట్లుగా మార్పులు చేశాడతను. అవి కొంత వరకు కథాగమనానికి అడ్డం పడ్డాయి. వినాయక్ ఇచ్చిన కమర్షియల్ టచ్ వల్ల మెగా అభిమానులకు.. మాస్ ప్రేక్షకులకు ‘ఖైదీ నెంబర్ 150’ చేరువ కావచ్చు. ఐతే కథను సిన్సియర్ గా చెప్పే విషయంలో మాతృక ‘ఖైదీ నెంబర్ 150’ కంటే మెరుగ్గా కనిపిస్తుంది.

చివరగా: ఖైదీ నెంబర్ 150.. మెగాస్టార్ మేనియా 

రేటింగ్:  3/5